మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2025 (18:27 IST)

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

jc prabhakar reddy
వైకాపా నేతలకు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీకు ఇదే లాస్ట్ దీపావళి అంటూ హెచ్చరించారు. పైగా, మేం మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరంటూ గట్టివార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా, ధర్మవరం వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. 
 
'ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నాడు. అలా అంటే మేం చేస్తూ ఊరుకోవాలా? మేం గనుక మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరు? అంటూ జేసీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడేటపుడు ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని వెంకట్రామిరెడ్డికి ఆయన హితవు పలికారు. 
 
తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి వ్యక్తి కాబట్టే వైకాపా నేతలు ఈ విధంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అడ్డుపడుతున్నారు కాబట్టే పరిస్థితి ప్రశాంతంగా ఉందని, లేకపోతే మరోలా ఉండేదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. 
 
అలాగే, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. పెద్దారెడ్డి ఇక ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడన్నారు. దేవుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా జరగొచ్చు. కానీ, నా ఆంచనా ప్రకారం పెద్దారెడ్డి మళ్లీ గెలలేడు. అయితే, ఆయన సోదరుడి కుమారుడు వెంకట్రామిరెడ్డి చిన్నవాడు.. ప్రజల్లో తిరుగుతున్నాడు.. అతనికి మళ్లీ అవకాశం ఉండొచ్చు అని జేసీ చెప్పుకొచ్చారు.