మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2025 (18:06 IST)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

kira - dk - harsh goenka
దేశ ఐటీ రాజధానిగా విరాజిల్లుతున్న బెంగుళూరు నగరంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఈ దుస్థితిపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా స్పందించారు. ఆమె వ్యాఖ్యలను కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగ్యంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. బెంగుళూరు రహదారుల దుస్థితిపై మజుందార్ చేసిన ట్వీట్‌కు మద్దతు తెలిపారు. 
 
మన రాజకీయ నేతలు విమర్శలను సానుకూలంగా స్వీకరించకపోవడం దురదృష్టకరమని హర్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. బెంగుళూరులోని క్షీణిస్తున్న మౌలిక సదుపాయాల గురించి కిరణ్ మజుందార్ షా మాట్లాడారని, ఆ సమస్యను పరిష్కరించాల్సిందిపోయి నేతలు దానిపై రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అనుకూల పోస్టులు పెట్టాలని ఆమెను బలవంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై దృష్టిసారించకుండా విమర్శలు చేస్తున్న వారిపై దాడి చేయడం సర్వసాధారణంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
 
కాగా, కిరణ్ మజుందార్‌ చేసిన ట్వీట్‌పై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ, రోడ్లు బాగు చేయించడానికి నిధులు ఇస్తామని, బాగు చేయించాలని ఆమెను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత రాజకీయ అజెండాతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.