ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (14:30 IST)

సమంతకు సలహా ఇచ్చిన మనోజ్ బాజ్‌పేయి

Samantha Ruth Prabhu
నటుడు మనోజ్ బాజ్‌పేయి ఇటీవల నటి సమంతకు సలహా ఇచ్చారు. "ఫ్యామిలీ మ్యాన్" సిరీస్‌లో ఆమె చేసిన శారీరక శ్రమపై కితాబిచ్చారు. 
 
ఈ సిరీస్‌లో సమంతతో కలిసి నటించిన మనోజ్ బాజ్‌పాయ్, ఆమె శారీరకంగా పనిచేసే విధానం చూసి తాను భయపడ్డానని చెప్పాడు. 
 
ఒక ఇంటర్వ్యూలో, "ఇది నన్ను భయపెట్టింది, ఆమెకు అది ఎంత బాధను ఇస్తుందో" అని చెప్పాడు. మనోజ్ బాజ్‌పేయి go easy on herself మాటలకు సమాధానంగా, సమంత తన ఆందోళనకు కృతజ్ఞతలు తెలుపుతూ "ప్రయత్నిస్తాను సార్" అని సమాధానం ఇచ్చింది. 
 
సమంతా ప్రస్తుతం తన చిత్రం "శాకుంతలం" విడుదల కోసం వేచి ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.