గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (10:04 IST)

అందుకే వేణుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేశా : దిల్‌రాజు

Venu-dilraju
Venu-dilraju
దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా ఉన్నాయి. త్వ‌ర‌లోనే ‘బలగం’ సినిమాను రిలీజ్ చేయ‌టానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘‘బలగం’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్ప‌టికే విడుద‌లైన ఊరు ప‌ల్లెటూరు సాంగ్ పొట్టి పిల్ల సాంగ్‌ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తున్నాయి. సినిమా ఆర్గానిక్‌గా ఆడియెన్స్‌లోకి వెళ్లిపోయింది. వేణు త‌న ఐడియాను ప్రాప‌ర్‌గా మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్‌కి చెప్ప‌టం, అలాగే దానికి అద్భుత‌మైన లిరిక్స్‌ని కాస‌ర్ల శ్యామ్ అందించారు. మంచి సోల్ ఉన్న సాంగ్స్‌ను అందించారు. సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తీ ఒక్క‌రూ ప్రాణం పెట్టి ప‌ని చేశారు. మ‌రో రెండు సాంగ్స్‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తాం. ఆ పాట‌లు వింటే హృద‌యాలు క‌దిలిపోతాయి. అంత గొప్ప‌గా ఉంటాయి పాట‌లు. 
 
దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ అనే ఐడియా వ‌చ్చిన‌ప్పుడు దీని ద్వారా వీలైనంత మంది కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియ‌న్స్‌ను ప‌రిచ‌యం చేయాల‌నేదే మా ఆలోచ‌న‌. అందులో భాగంగా ముందు వేణు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యాడు. ఇక హీరో ద‌ర్శి గురించి చెప్పాలంటే సెల్ఫీష్ క్యారెక్ట‌ర్‌ను త‌ను క్యారీ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇక హీరోయిన్ కావ్య గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. మా సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ మ‌సూద‌తో ముందుగానే మీ అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యింది. ద‌ర్శి, కావ్య‌.. ఎమోష‌న్స్‌ను చాలా చ‌క్క‌గా క్యారీ చేశారు. వేణు ఇంత మందిని ఎంతో గొప్ప‌గా రాసుకున్నారు. తెలంగాణకి చెందిన ప‌ల్లెటూర్లో జ‌రిగే క‌థ కావ‌టంలో తెలంగాణ‌ క‌ల్చ‌ర్ తెలిసిన చాలా మంది ఈ సినిమాను చూశారు. సినిమా చాలా చాలా బాగుంద‌ని అంద‌రూ అభినందించారు. కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు గుర్తుకు వ‌స్తాయి.అలాగే ర‌వి, కృష్ణ‌తేజ మ‌న‌ల్ని వారి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటారు’’ అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ, ఇక ఇప్ప‌టికే మా ‘బలగం’ మూవీ నుంచి విడుదలైన రెండు సాంగ్స్‌కు భీమ్స్‌గారు ఇచ్చిన సాంగ్స్‌, దానికి కాస‌ర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ఎక్స‌లెంట్‌. పాట‌ల‌న్నీ శ్యామ్‌గారే రాశారు. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే.  ఈ జ‌ర్నీలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.