సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (11:24 IST)

ప్రేమికుల లిస్ట్‌ చాలానేవుందంటున్న హీరో నాని

Nani, Yalavarthy Anjana
Nani, Yalavarthy Anjana
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే. దీన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆ పోకడ ఇండియాలోనూ వచ్చింది. ఇక దీనిపై తరచుగా హీరోలను హీరోయిన్‌లను అడిగితే సిగ్గుపడుతూ చెప్పేస్తుంటారు. అలాంటిదే హీరో నాని విషయంలో జరిగింది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం దసరా. ఈ సినిమాలోని ఓ మాస్‌ సాంగ్‌ను విడుదల చేశారు. అందులో తను ప్రేమించిన అమ్మాయి కాదనేసరికి మందుకొడుతూ తను పనిచేసే బొగ్గుగని కార్మికులతో పాట పాడతారు. పైగా ఈ పాటను ఎవరైనా ప్రేమలో ఓడిపోతే రాత్రి పూట వింటూ హాయిగా నిద్రపోండి అంటూ సలహాఇచ్చారు. 
 
ఈ సందర్భంగా రియల్‌లైఫ్‌లో ఎవరెవరిని ప్రేమించారు. వాలెటైన్‌డే సందర్భంగా మీరు నిజాలు చెప్పాల్సిందే అని యూత్‌ అడగగా.. కాలేజీ డేస్‌లో నాకునేనే ప్రేమించిన అమ్మాయిలు చాలా మందే వున్నారు. నేను ఇష్టపడినా వారు పట్టించుకోకుండా వున్న లిస్ట్‌ చాలానే వుంది. అందుకే అవన్నీ మర్చిపోవాల్సిందే. ఫైనల్‌గా నా జీవితంలో నేను ప్రేమించిన, నన్ను ప్రేమించిన అంజనా నా జీవిత భాగస్వామ్యమైంది అంటూ వివరించారు. యలవర్తి అంజనా హీరో నానికి కాలేజీనుంచి ఫ్రెండ్‌ కూడా. తనే నాని కాస్ట్యూమ్‌ విషయంలో సూచనలు కూడా చేస్తుంది.