ఆర్.సి. 15 కోసం గణేష్ ఆచార్యతో రామ్ చరణ్ డాన్స్
Ram Charan, Ganesh Acharya
రామ్‌చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్.సి. 15 సినిమా కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ముంబైలో వున్న చరణ్.. బాలీవుడ్ డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్యతో కలిసి డాన్స్ చూస్తూ పోస్ట్ చేశాడు. గతంలో అక్షయ్‌కుమార్ నటించిన సినిమాలోని మై ఖిలాడి తూ అనారి.. మూవీలోని టైటిల్ సాంగ్‌ను డాన్స్ చేస్తూ అలరించాడు. లావుగా వున్న గణేష్‌ను అభినందిస్తూ మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలంటూ కితాబిచ్చాడు.
ఈ వీడియో ఇప్పటికే రామ్ చరణ్ ఫ్యాన్స్ వైరల్ చేసేశారు. మరి ఆర్.సి. 15 సినిమాలో ఇంకెన్ని అప్‌డేట్స్ వుంటాయో చూడాలి. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ నాయికగా నటిస్తోంది. థమన్ బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పెళ్లి తర్వాత కియారా అద్వానీ షూట్లో పాల్గొననుంది.