గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (10:13 IST)

ఆస్కార్‌ అకాడెమీ లంచ్ కు హాజరై అందరికీ థ్యాంక్స్‌ చెప్పిన కీరవాణి, చందబ్రోస్‌

bose, keeravani at losangels
bose, keeravani at losangels
తెలుగు సినిమా రౌద్రం రణం రుధిరం (ఆర్‌.ఆర్‌.ఆర్‌.) సినిమాలోని నాటునాటు సాంగ్‌ ఆస్కార్‌ కు నామినేట్‌ అయింది. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి కుటుంబం హాజరయింది. అక్కడ జేమ్స్‌ కామెరెన్‌ను కూడా రాజమౌళితో చర్చించారు. అయితే పాటకు ప్రాణం సంగీతంతోపాటు సాహిత్యం కూడా. అందులో పాడిన గాయకులు కూడా. కొరియోగ్రాఫర్‌ కూడా ముఖ్యం. వీరెరవరూ అక్కడికి వెళ్ళలేదని చర్చ ఫిలిం వర్గాల్లో జరిగింది. దీనికి సమాధానంగా నిన్ననే కీరవాణి, చంద్రబోస్‌లు ఆస్కార్‌ నామిని అకాడెమీ లంచ్‌కు హాజరయినట్లు ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశారు.
 
bose, keeravani at oscar function
bose, keeravani at oscar function
ఈ సందర్భంగా అక్కడి రిపోర్ట్‌ వీరిని ఇంటర్వ్యూ చేస్తూ, మీ స్పీచ్‌ చాలా ఇన్‌స్పైర్‌గా వుందంటూ అడగగానే. ఇది నా మనసులోతుల్లోంచి హృదయపూర్వకంగా వచ్చిన మాటలని కీరవాణి బదులిచ్చారు. ఇంకా ఎవరికైనా థ్యాంక్స్‌ చెప్పాలనుందా? అని ప్రశ్న వేయగానే... చంద్రబోస్‌ బదులిస్తూ, ముందుగా సంగీత దర్శకుడు కీరవాణిగారికి, యాక్టర్‌, కొరియోగ్రాఫర్‌, సింగర్స్‌కు, దర్శకుడికి థ్యాంక్స్‌ చెప్పాలి అని అన్నారు. ఆ తర్వాత కీరవాణి స్పందిస్తూ.. నా పేరెంట్స్‌, నా మెంటర్స్‌కూ థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. సమయం వ్యవధిలేకపోవడంతో అందరికీ అప్పట్లో చెప్పలేకపోయానని అన్నారు.