బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (10:05 IST)

ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నాడా..? ఇదేమైనా జోకా? శ్రీలంక

prabhakaran
ఒకపుడు శ్రీలంక ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా జీవించివున్నారని, ఆయన త్వరలోనే బాహ్యప్రపంచంలోని వస్తారంటూ తమిళ జాతీయవాద సంస్థ అధ్యక్షుడు పళ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. 
 
ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికేవున్నాడంటూ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ, ఇదేమైనా జోకా అంటూ ఆ దేశ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. అలాగే, శ్రీలంక రక్షణ శాఖ అధికారి ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, 2009 మే 19వ తేదీన ప్రభాకరన్ హతమైనట్టు ధృవీకరించామని తెలిపారు. పైగా, ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించినట్టు స్పష్టం చేసింది.