ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:43 IST)

వ్యక్తి గొంతులో ఇరుక్కున్న జలగ.. 15 రోజుల పాటు ప్రాణాలతోనే...

leech stuck in throat
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ వ్యక్తి గొంతులో జలగ ఇరుక్కుని పోయింది. ఇది ఏకంగా 15 రోజుల గొంతులోనే ఉండిపోయింది. పైగా, ఇది 15 రోజులపాటు జీవించి ఉండటం గమనార్హం. చివరకు వైద్యులు ఆపరేషన్ చేసి ఆ జలగను తొలగించారు. అలాగే, బాధితుడి ప్రాణాలను కూడా కాపాడారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సజిన్ రాయ్ (49) అనే వ్యక్తి 15 రోజుల క్రితం పర్వత ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో దాహం వేయడంతో ఊట బావిదగ్గర నీటిని తాగాడు. ఆ సమయంలో ఆ అతనికి తెలియకుండానే అతని గొంతులోకి జలగ ఒకటి వెళ్లింది. అది చివరకు శ్వాసనాళంలోకి వెళ్లి అంటుకుని పోయింది. 
 
అప్పటి నుంచి ఆ వ్యక్తి శ్వాసపీల్చడంలో అసౌకర్యంగా ఉండసాగింది. రోజులు గడిచేకొద్దీ శ్వాసపీల్చడం కష్టతరంగా మారింది. దీంతో ఆస్పత్రిక వెళ్లి వైద్యుల సలహా మేరకు స్కాన్ చేయగా, గొంతులో జలగ ఇరుక్కుని ఉన్నట్టు తేలింది. ఆ వెంటనే ఆపరేషన్ చేసి గొంతులో ఇరుక్కున్న జలగను వైద్యులు వెలికి తీశారు.