శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2022 (11:23 IST)

ప్రేమించలేదని సర్జికల్ బ్లేడ్‌తో గొంతుకోశాడు.. యువతి మృతి

crime scene
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో ఓ ప్రేమికుడు యువతి గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి(21) విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) మూడో సంవత్సరం చదువుతోంది. 
 
ఈమెకు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మణికొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జ్ఞానేశ్వర్ రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. జ్ఞానేశ్వర్ తనను ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధించడంతో ఆమె ఇటీవల విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇకపై ఇలా చేయవద్దని హెచ్చరించి పంపించారు. అయినా జ్ఞానేశ్వర్ వేధింపులు ఆపలేదు. దీంతో 10 రోజుల క్రితం తపస్విని తన స్నేహితురాలితో వుందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్ తనతోపాటు సర్జికల్ బ్లేడ్, కత్తిని తీసుకుని తపస్వి ఉంటున్న ప్రాంతానికి వెళ్లి సర్జికల్ బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. ఈ ఘటనలో తపస్విని  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో జ్ఞానేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.