ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే వున్నారు.. నెడుమారన్
ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారనే శుభవార్తను తెలియజేస్తున్నానని ఎల్టీటీఈ లీడర్ పళ నెడుమారన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పళనెడుమారన్ మాట్లాడుతూ, తమిళ ఈలం ప్రజల ఆవిర్భావానికి సంబంధించిన ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానన్నారు.
తమిళ ఈలం ప్రజలు, ప్రపంచ తమిళులు ఏకమై తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎల్టీటీఈ బలంగా ఉన్నంత వరకు భారత వ్యతిరేక దేశాలు తమ గడ్డపై అడుగు పెట్టనివ్వలేదని, భారత వ్యతిరేక దేశాలకు ఏ సమయంలోనూ ఎవరి నుంచి సాయం అందదని నెడుమారన్ తేల్చి చెప్పారు.
ప్రస్తుతం శ్రీలంకలో చైనా లోతైన స్థావరాన్ని నెలకొల్పేందుకు, భారత్ వ్యతిరేక స్థావరంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని నెడుమారన్ దుయ్యబట్టారు. చైనా పట్టులో ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే తమిళనాడులోని అన్ని పార్టీలు, తమిళ ప్రజలు ప్రభాకరన్‌కు మద్దతు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు.