మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (11:49 IST)

ప్రస్తుతానికి ఇంకా చావలేదు : కన్నీరుపెట్టుకున్న సమంత

Samantha
హీరోయిన్ సమంత తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తాను ఇంకా చావలేదంటూ బోరున విలపించారు. ప్రస్తుతం ఆమె అరుదైన మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, ఈ తరహా వ్యాధిని చాలా మంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. తాను కూడా దీన్ని ఎదుర్కొంటానని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు. అదేసమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. 
 
త్వరలోనే ఈ వ్యాధి నుంచి బయటపడతానని, ప్రస్తుతానికైతే తాను ఇంకా చావలేదన్నారు. మన నియంత్రణలో ఏదీ ఉండదని, మన లైఫ్ డిసైడ్ చేస్తుందని తెలిపారు. తాను ఇపుడు కఠిన పరిస్థితుల్లోనే ఉన్నానని గుర్తుచేసిన సమంత.. అందరి జీవితాల్లో మంచి చెడు రోజులు ఉంటాయని చెప్పారు. ఒక్కక్కసారి ఒక్క అడుగు కూడా వేయలేమో అని అనిపిస్తుందని, అయితే, తాను పోరాటం చేస్తానని, గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసినప్పటి నుంచి సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు ఎంతో ఆవేదన చెందుతూ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా నటించిన యశోద చిత్రం ప్రమోషన్ కోసం తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆమె ఒకింత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.