ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (13:08 IST)

సమంత-చైతూ విడాకులకు కారణం అదేనా?

Samantha Akkineni
దక్షిణ భారత నటి సమంత రూత్ ప్రభుకు మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించి సోషల్ మీడియా ద్వారా వార్తలను పంచుకుంది. 
 
నటుడు నాగార్జున కుమారుడు, ఆమె మాజీ భర్త నాగ చైతన్య, సోదరుడు అఖిల్ అక్కినేని, మెగాస్టార్ చిరంజీవితో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సమంతకు ఓదార్చారు. 
 
ఇకపోతే.. నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సమంత... మూడేళ్ల పాటు వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడిపినా.. ఎన్నో గొడవల కారణంగా విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 
 
అయితే విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తాజాగా ఆమె మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. సమంత ఈ వ్యాధితో బాధపడుతుండడంతో ఆమె విడాకులను ఈ వ్యాధితో ముడిపెడుతున్నారు కొందరు. 
 
విడాకులకు ముందే సమంతకు ఆ జబ్బు ఉందని తెలుసు. అందుకే ఆమె జబ్బు కారణంగానే నాగ చైతన్య విడాకులు తీసుకున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.