గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (19:06 IST)

సమంతపై ప్రశంసల వర్షం కురిపించిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ 'యశోద' ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ యూనిక్ బెన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈయన 'యశోద' చిత్రానికి పనిచేశారు. 
 
కాగా, సమంతతో యానిక్ బెన్ కు ఇది రెండో ప్రాజెక్టు. గతంలో సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ కు కూడా యానిక్ బెన్ పనిచేశాడు. సమంతతో పోరాట దృశ్యాలను తెరకెక్కించిన యానిక్ బెన్ సమంత ఆరోగ్యంపై  స్పందించాడు. సమంత అంకితభావంతో పనిచేస్తుందని, అలాంటి నటితో పనిచేయడం ఎంతో బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. 
 
సమంత ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తుందని చెప్పాడు. యశోద చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ చూస్తే నిజమైన పోరాట దృశ్యాల్లా అనిపిస్తాయని, స్టంట్స్ రియల్‌గా వచ్చేందుకు సమంత ఎంతో సహకరించిందని కొనియాడాడు.