శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (20:50 IST)

'గాడ్ ఫాదర్' నటుడు జేమ్స్ కాన్ కన్నుమూత

James Caan
James Caan
హాలీవుడ్ 'గాడ్ ఫాదర్' నటుడు మరణించారనే వార్త విని సినీ ప్రేక్షకులంతా షాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ 'గాడ్ ఫాదర్' నటుడు జేమ్స్ కాన్ శుక్రవారం కన్నుమూశారు. ఈయన వయసు 82 ఏళ్లు. 'గాడ్ ఫాదర్' లో ఈయన క్రైమ్ బాస్ వీటో కార్లియోన్ పెద్ద కొడుకుగా నటించాడు. 
 
సోనీ కార్లియోన్ పాత్రలో ఈయన అద్భుతంగా నటించాడు. తర్వాత రోలర్ బాల్, థీఫ్, మిజరీ,రోబ్ రీనర్స్ వంటి చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయన సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. 
 
ఒకానొక టైంలో ఈయన ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యారు. 1963వ సంవత్సరం నుండి 2021వ సంవత్సరం వరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.