రామ్ చరణ్ ఆవిష్కరించిన పరంపర 2 వెబ్ సిరీస్ ట్రైలర్
Parampara 2 poster
ట్రైలర్ చూస్తే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా పరంపరం 2 వెబ్ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర లాకున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకుంటోంది. ఓ రియల్ రివేంజ్ యాక్షన్ డ్రామా ట్రైలర్ లో ఆవిష్కృతమైంది. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. జూలై 21 నుంచి 'పరంపర' సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
