దిల్ రాజు ఇంట ఆనందోత్సవాలు ఎందుకో తెలుసా!
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు నైజాంలో నెంబర్ 1. ఎగ్జిబిటర్ అయిన దిల్‌రాజు ఇంటిలో ఈరోజు సందడి నెలకొంది. ఆయనకు ఇండస్ట్రీ ప్రముఖులనుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కారణం ఆయన బుధవారంనాడు బుల్లి రాజు పుట్టాడు. ఇప్పటివరకు వరకు ఆయనకు వారసుడులేడు. తన సోదరుడు శిరీష్ కొడుకుతో ఇటీవలే మీరోగా పరిచయం చేశాడు.
ఇక దిల్‌రాజు భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించింది. ఆ తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుని కరోనా ఉదృతంగా వున్న టైంలో ఎయిర్ హోస్టెస్ అయిన తేజస్విని వివాహం చేసుకున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు వారిరిద్దరికి వారసుడు జన్మించాడు. దాంతో దిల్‌రాజు ఎంత ఆనందంగా వున్నాడోగానీ ఆయన సోదరులు, సన్నిహితులు, బిజినెస్ పార్టనర్లు ఎంతో ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. దిల్‌రాజు అనిత దంపతలుకు హన్సితారెడ్డి కుమార్తె. తను ఇప్పుడు ఆహా ఓటీటీలో భాగస్వామిగా వున్నారు. ఇప్పటికే దిల్‌రాజు బాలీవుడ్‌లోనూ నిర్మాతగా ప్రవేశించారు.