బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (12:00 IST)

త్వరగా కోలుకో సామ్.. సమంతకు ఎన్టీఆర్ ఓదార్పు

Samantha
దక్షిణాది హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆమె జీవితంలో గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆమె మైయోసైటిస్‌కు చికిత్స పొందుతున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటోంది. ప్రస్తుతం సమంతకు అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు. 
 
ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. "త్వరగా కోలుకో సామ్. మా అందరి బలాన్ని పంపిస్తున్నాను" అని ఎన్టీఆర్ తన ట్విట్టర్‌లో రాశారు. వీరిద్దరూ కలిసి బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాల్లో నటించారు. 
 
సమంత త్వరలో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారనుంది. ఇలాంటి సమయంలో ఆమె అనారోగ్యం పాలవడం నిజంగా చేదు వార్తే అని చెప్పాలి. మరోవైపు సమంత నటించిన ‘యశోద’ చిత్రం నవంబర్ 11న విడుదల కానుండగా.. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగానే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.