శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (18:20 IST)

12 రాశులు- బీజాక్షర మంత్రాలు.. పఠిస్తే ఎంత మేలంటే? (video)

Astrology
Astrology
ఈ బీజాక్షర మంత్రాలకు మన శరీరంలోని చక్రాలను ఉత్తేజపరిచి, అవి సజావుగా పనిచేసేలా చేసే శక్తినిస్తాయి. బీజం అంటే విత్తనం. అక్షరం అంటే అక్షరం, బీజ + అక్షరం అంటే బీజం లాంటి అక్షరం. అంటే బీజాక్షరం అనే పదాన్ని ఒకే ఒక్క అక్షరంతో కూడిన మంత్రాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. 
 
ఈ బీజాక్షర మంత్రాన్ని ఆచరించడం వల్ల శరీరంలో ఆత్మ-ప్రాణశక్తి పెరుగుతుంది. కాబట్టి బీజాక్షర మంత్రానికి ఇతర మంత్రాల కంటే ఎక్కువ శక్తి ఉంది. ఈ మంత్రాలను రోజూ పఠిస్తే ఆత్మశుద్ధి, ప్రాణశుద్ధి చేకూరుతుంది. ముఖ్యంగా 12 రాశుల వారీగా బీజాక్షర మంత్రాలను తెలుసుకుందాం.. 
 
మేషం - ఓం ఐం క్లీం సౌం
వృషభం - ఓం ఐం క్లీం శ్రీం
మిథునం - ఓం క్లీం ఐం సౌం
కర్కాటకం - ఓం ఐం గ్లీం శ్రీం
సింహం - ఓం హ్రీం శ్రీం సౌం
కన్య - ఓం శ్రీం ఐం సౌం
తుల - ఓం హ్రీం క్లీం శ్రీం
వృశ్చికం - ఓం ఐం క్లీం సౌం
ధనుస్సు - ఓం హ్రీం క్లీం సౌం
మకరం - ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌం
కుంభం - ఓం హ్రీం ఐం క్లీం శ్రీం
మీనం - ఓం హ్రీం ఐం క్లీం శ్రీం.. ఈ బీజాక్షర మంత్రాన్ని రోజూ 12 రాశుల వారు పఠించడం ద్వారా జ్ఞాన శక్తి పెంపొందుతుంది. శరీరంలోని చక్రాలు ఉత్తేజమవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.