శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (16:42 IST)

సమంత-చైతూ ఒక్కటవ్వండి.. ఫ్యాన్స్ ఎమోషనల్ పోస్ట్

Nagachaitanya, Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్యం పాలైంది. ఈమెను సెలెబ్రిటీలు పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓదార్చుతున్నారు. తాజాగా సామ్‌ను.. ఆమె ఎక్స్ హస్బెండ్ చైతూ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాడని టాక్ వస్తోంది. ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని వార్తలు వస్తున్నాయి. 
 
కానీ అసలు అలాంటిదేం జరగలేదని కొట్టిపడేసేవారు కూడా ఉన్నారు. దీనిపై చైతూ లేదా సామ్ నుంచి సమాధానం రావాల్సి ఉంది. అక్కినేని కాంపౌండ్ నుంచి హీరోలు.. అఖిల్, సుశాంత్ సమంతకు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెప్పారు. 
 
అయితే తాజాగా సమంత అనారోగ్యం నేపథ్యంలో చైయ్-సామ్ ఫ్యాన్స్ ఎమోషనల్‌గా రెస్పాండ్ అవుతున్నారు. సమంత తన సోషల్ మీడియాలో చైతూతో ఉన్న ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ.. చైతూ ఆ పని చేయలేదు. దీంతో ఆ ఫోటోల కింద ప్రజంట్ ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు ఈ మాజీ కపుల్ ఫ్యాన్స్. మళ్లీ మీరు ఒక్కటవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.