1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (09:49 IST)

పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం తారా స్థాయికి.. లీటరు పాల ధర రూ.210

daily milk
పాకిస్థాన్ దేశంలో ఆర్థిక, ఆహార సంక్షోభం తారా స్థాయికి చేరింది. దీంతో నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా కేజీ చికెన్ ధర రూ.780 పలుకుతుండగా, లీటరు పాల ధర రూ.210గా ఉంది. ఈ ధరల భారంతో పాకిస్థాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో గతంలో శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక, దుర్భిక్ష పరిస్థితులే నెలకొనివున్నాయి. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో పాల లీటరు ధర రూ.190 నుంచి రూ.210 వరకు పలుకుతుంది. ఇక బ్రాయిలర్ చికెన్ ధర కేజీకి రూ.30 నుంచి రూ.40 చొప్పున పెరిగి ఇపుడు ఏకంగా రూ.780కి చేరింది. ఈ ధరలు చూసిన పాక్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 
 
దీనికి కారణం నానాటికీ అడ్డూ అదుపులేకుండా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. మరోవైపు, ఆర్థిక సంక్షోభం కారణంగా ఇంధర ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఫలితంగా ప్రస్తుతం ఇంధన ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.250 పలుకుతుండగా, లీటరు కిరోసిన్ ధర రూ.190 నుంచి రూ.200గా వుంది. పైగా, నానాటికీ ఇంధన డిమాండ్ పెరిగిపోతోంది.