1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (11:23 IST)

ఉగ్రవాద విత్తులు నాటినందుకు మూల్యం చెల్లించుకుంటున్నాం.. పాకిస్థాన్ హోం మంత్రి రానా

పాకిస్థాన్‌ దేశ పాలకులకు ఉగ్రవాదుల దుశ్చర్యల గురించి ఇపుడు తెలిసొస్తుంది. ఒకపుడు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను పెంచి పోషించింది. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసింది. ఇపుడు అదే ఉగ్రవాదానికి పాకిస్థాన్ బలవుతోంది. ఈ మేరకు ఆ దేశ హోం మంత్రి ఆ దేశ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముజాహిదీన్‌లను సృష్టించిన పాకిస్థాన్ తప్పు చేసిందని హోం మంత్రి రానా సనావుల్లా అంగీకరించరు. వారే ఇపుడు ఉగ్రవాదులుగా మారి పాక్ పాలిట శత్రువులుగా మారారని చెప్పారు. 
 
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌లోని ముసీదుల్లో ఉగ్రవాదులు వరుసగా ఆత్మాహతి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పెషావర్‌లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 97 మంది పోలీసులే ఉండటం గమనార్హం. ఈ పేలుడు జరిగిన ప్రాంతాన్ని పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసీం మునీర్ సోమవారం పెషావర్ వెళ్లి పరిశీలించారు. 
 
దీనిపై పాక్ హోం మంత్రి రానా సనావుల్లా పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. మనం ముజాహిదీన్‌లను సృష్టించాం. వారే ఇపుడు ఉగ్రవాదులయ్యారు. భారత్, ఇజ్రాయేల్ వంటి దేశాల్లో కూడా మసీదుల్లో ఆత్మాహుతి దాడులు జరగలేదని అన్నారు. ఉగ్రవాదు విత్తనాలు నాటి పెంచి పోషించినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ ఉగ్రవాదుల దాడులవల్ల ఇప్పటివరకు 12600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించిందని తెలిపారు.