సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (19:41 IST)

పాకిస్థాన్ రూపాయి పతనం.. ఆర్థిక సంక్షోభం..

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 81 రూపాయలకు పైగా పెరగగా.. పాక్ రూపాయి విలువ పతనమైందని బయటకు వచ్చిన సమాచారం కలకలం సృష్టించింది. 
 
గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌లో ఆర్థిక పతనం జరుగుతోందని, ఆ దేశం దివాళా తీసే పరిస్థితి ఎంతో దూరంలో లేదని ప్రపంచ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 
 
అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువలో మునుపెన్నడూ లేనంతగా పతనమైనట్లు తెలుస్తోంది. పాక్‌ రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్‌ విలువ రూ.255కి పడిపోవడంతో పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది
 
ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వ భవనాలు అమ్ముడుపోవడం, రూపాయి విలువ క్షీణించడం షాక్‌కు గురి చేసింది.