శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (11:01 IST)

ఉక్రెయిన్- రష్యా పరిణామాలు.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఉక్రెయిన్- రష్యా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో  దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలో ప్రారంభమయ్యాయి. చమురు బ్యారెల్ ధర 130 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు అలముకున్నాయి. 
 
రష్యా ఇప్పటి వరకు కఠిన ఆంక్షల ప్రయోగించిన పాశ్చాత్య దేశాలు.. తాజాగా ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న చమురును ఆంక్షల పరిధిలోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. 
 
ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను సైతం తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 10.33 గంటల సమయంలో సెన్సెక్స్ 1,730 పాయింట్ల నష్టంతో 52,603 వద్ద, నిఫ్టీ 487 పాయింట్లు నష్టపోయి, 15,758  వద్ద ట్రేడవుతున్నాయి.