రష్యాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్ సేనలు
రష్యాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సేనలు కూల్చివేశాయి. గత 11 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సాగిస్తున్న విషయం తెల్సిందే. ఈ యుద్ధాన్ని తక్షణం ఆపాలంటూ ప్రపంచ దేశాలు చేస్తున్న విజ్ఞప్తులను రష్యా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సైతం పట్టుకుని ఈడ్చుకొచ్చి కాల్చిపారేస్తుంది.
మరోవైపు, రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ నుంచి 1.5 మిలియన్ల మంద ఇతర దేశాలకు తరలిపోయారు. మరోవైరు, ఉక్రెయిన్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేస్తున్న విజ్ఞప్తులను నాటో దేశాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధంతో ఇరు వైపులా భారీ నష్టం వాటిల్లుతుంది.
ఇదిలావుంటే, తమ దేశంపై బాంబులు కురిపించందుకు వచ్చిన రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సేనలు కూల్చివేశాయి. ఖార్కివ్ మీదుగు ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ప్రకటించింది. పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. కులినిచిన్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది.