శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (12:28 IST)

భార్య ప్రియుడిపై భర్త కాల్పులు.. పురుషాంగంపై కాల్పులు

భార్య ప్రియుడిపై భర్త కాల్పులు జరిపారు. కేరళ, చెంగ్గనూర్ జిల్లాలో దారుణం జరిగింది. పురుషాంగంపై తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ముండంకాపుగా వాసిగా గుర్తించారు.
 
అయితే భర్త.. భార్యతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో భార్య వేరొకరితో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న భర్త.. భర్య ఇంటికి చేరుచుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. 
 
ఈ కాల్పుల్లో ప్రియుడి పురుషాంగం వద్ద తీవ్ర గాయమైంది. ప్రస్తుతం క్షతగాత్రుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులకు ప్రియుడు ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.