బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (13:13 IST)

రష్యాకు షాక్ ఇచ్చిన శామ్‌సంగ్: మైక్రోసాఫ్ట్, ఆపిల్‌ బాటలో..?

ఉక్రెయిన్‌పై రష్యా భీకరపోరు కొనసాగిస్తోంది. దీనిపై ప్రపంచ దేశాలు రష్యాపై ఫైర్ అవుతున్నాయి. ఉక్రెయిన్‌కు పలు దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అలాగే ఇతర కంపెనీలు కూడా రష్యాకు షాకిస్తున్నాయి. 
 
రష్యాకు తమ ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఆపిల్‌తో పాటు ఇతర టెక్ దిగ్గజాలు రష్యా దేశంలో తమ అమ్మకాలు, సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 
 
తాజాగా శామ్‌సంగ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు తమ ఉత్పత్తులు, ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఉక్రెయిన్‌పై మానవతా దృక్పధంతో కంపెనీ 6 మిలియన్ల డాలర్ల విరాళం ప్రకటించింది.
 
కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఆపిల్‌ కంపెనీ రష్యాలో ఆపిల్‌ పే, ఇతర సేవలను పరిమితం చేసింది. ఉక్రెయిన్‌పై దాడి రష్యా చేస్తున్న దాడుల కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధిస్తోంది. అలాగే యూరోపియన్ యూనియన్ తమ గగనతలంపై రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించాయి.