శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (13:02 IST)

మూడోసారి రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ సిద్ధం

ఉక్రెయిన్ సైనిక దళాలు కూడా రష్యాతో తలపడుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌ దేశంలోని పలు కీలక నగరాలు రష్యా స్వాధీనంలోకి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య జరిగిన రెండు దఫాల చర్చలు ఫలితాలనివ్వలేదు. ప్రస్తుతం ఇంకోసారి రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రష్యాతో మూడో సారి చర్చలకు ఉక్రెయిన్ సన్నాహాలు చేస్తోంది.
 
మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి విద్యార్థులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 48 ప్రత్యేక విమానాల్లో 10,300 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
 
శనివారం మరో 11 పౌర విమానాలు, నాలుగు వాయుసేన విమానాల్లో 2200 మంది స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న నగరాల్లోని భారతీయులను రష్యాకు తరలించి అక్కడ్నుంచి భారత్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు రష్యా కూడా సహకరించేందుకు అంగీకరించింది.