మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 మార్చి 2022 (23:07 IST)

జెలెన్స్కీ పోలాండ్‌కు పారిపోయాడన్న రష్యా: ఇక్కడే వున్నానన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

జెలెన్స్కీ పోలాండ్‌కు పారిపోయాడంటూ శుక్రవారం నాడు రష్యా వార్తలను ప్రసారం చేసింది. ఐతే రష్యా వాదనలను ప్రతిఘటిస్తూ, ఉక్రేనియన్ పార్లమెంట్ తమ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ పోలాండ్‌కు పారిపోలేదని, ప్రస్తుతం కీవ్‌లోనే ఉన్నారని పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు తన దేశం నుండి పారిపోయి పోలాండ్‌లో ఉన్నారని రష్యా శాసనసభ్యుడు ఆరోపించిన తర్వాత ఈ కౌంటర్ ఇచ్చింది ఉక్రెయిన్.

 
అంతకుముందు కూడా ఉక్రేనియన్ ప్రెసిడెంట్ దేశం విడిచి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఉక్రేనియన్ ప్రెసిడెంట్ అటువంటి వార్తలను తిప్పికొట్టారు. తను కీవ్‌లో ఉన్నానని పేర్కొన్నారు. వాస్తవానికి జెలెన్స్కీని దేశం విడిచిపెట్టి వెళ్లాలని యునైటెడ్ స్టేట్స్ ప్రతిపాదన చేసింది. ఐతే దాన్ని ఆయన పూర్తిగా తిరస్కరించాడు. ఆ సందర్భంలో జెలెన్స్కీ మాట్లాడుతూ... పారిపోవడం కాదు... తనకు ఆయుధాలు కావాలని పేర్కొన్నాడు.