శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (12:14 IST)

రెండో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడులు

రష్యా మరో అణు విద్యుత్ కేంద్రంపై కన్నేసింది. ఉక్రెయిన్‌లోని మైకలేవ్ ప్రాంతంలో ఉన్న రెండో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ పైనే రష్యా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. 
 
ఈ అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా రష్యా బలగాలు చొచ్చుకుని వస్తున్నట్టు కనిపిస్తోంది. రష్యా అణు విద్యుత్ ప్లాంట్లను స్వాధీనం చేసుకోవడంపై ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
 
అణు విద్యుత్ ప్లాంట్లపై దాడులకు పాల్పడితే ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అతిప్రమాదకరమైన విపత్తు పొంచి ఉందని అంటోంది. 
 
ఇప్పటికే సిటీలోకి దూసుకొచ్చిన రష్యా బలగాలు పోర్టు సిటీ, పోల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. రష్యా బలగాలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం కూడా ఎదురుదాడులకు దిగుతోంది. ఈ యుద్ధం కారణంగా చాలామంది పౌరులు, సైన్యం ప్రాణాలు కోల్పోయారు.