దేశంలో తగ్గుతున్న వంట నూనెల ధరలు
కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో వంట నూనెల ధరలు కిందికి దిగివస్తున్నాయి. దిగుగమతి చేసుకునే వంట నూనెలపై కేంద్రం వసూలు చేస్తూ వచ్చిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసింది. దీని ఫలితంగా ఈ వంట నూనెల ధరలు బాగా తగ్గిపోతున్నాయి.
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీలో నూనె గింజల మార్కెట్‌లో గురువారం సోయాబీన్, సీపీఓ, పామోలిన్ ధరలు బాగా తగ్గిపోయాయి. చౌక ధరల మధ్య విదేశీ నూనెలకు డిమాడ్ కారణంగా ఆవాలు, వేరుశెనగ నూనె, నూనె గింజలు, సోయాబీమ్, పత్తి నూనె ధరలు మనుపటి స్థాయిలో ముగిశాయి. మిగిలిన నూనె, నూనె గింజల ధరలు కూడా మునుపటి స్థాయిలోనే ఉన్నాయి.
ఇదిలావుంటే, దేశంలో ఆవాల కొరత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న నూనెల కొరత తీర్చడానికి, శుద్ధి చేసిన ఆవాల తయారీకీ అధిక డిమాండ్ ఉంది. ఈ కారణంగా శుద్ధి చేసిన ఆవాల వినియోగం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో ఆవాల విషయంలో సమస్యలను కలిగించనుంది.