సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (12:02 IST)

అనుష్క నవ్వితే అన్నీ ఆపేయాల్సిందే.. విచిత్రమైన సమస్యతో స్వీటీ

anushka
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఇపుడు ఓ విచిత్రమైన సమస్యతో బాధపడుతున్నారు. వెండితెరపై ఎంతో మందిని నవ్వించిన ఈ స్వీటీ.. ఇపుడు తాను నవ్వు ఆపుకోలేని సమస్యతో బాధపడుతున్నారు. నవ్వితో ఏకంగా 15 నిమిషాల పాటు స్వీటీ అలాగే నవ్వుతోంది. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించింది. 
 
ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న చిత్రం "మిస్టర్ పోలిశెట్టి" చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగులో స్వీటీ బిజీగా గడుపుతున్నారు. ఈ షూటింగు సమయంలోనే ఆమె వింత సమస్య వెలుగులోకి వచ్చింది. నవ్వు ఆపుకోలేని ఒక విచిత్రమైన సమస్యతో ఆమె ఇబ్బంది పడుతున్నారు.
 
ఒక్కసారి నవ్వితే కనీసం పది నుంచి 15 నిమిషాల పాటు ఆమె నవ్వు ఆపుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు. తాను నవ్వడం ప్రారంభిస్తే షూటింగును కాసేపు ఆపేస్తారని స్వీటీ వెల్లడించారు. తాను అటూ ఇటూ తిరుగుతూ నవ్వుతూ ఉంటానని చెప్పారు.