శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (11:24 IST)

నాటు నాటు పాటకు బ్రహ్మాజీ స్టెప్పులు..

NTR_Kalyan Ram
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. 
 
వేదికపై యాంకర్ సుమ, నటుడు బ్రహ్మాజీ మధ్య జరిగిన ఫన్నీ ఎక్స్‌ఛేంజ్‌తో ఈవెంట్ నవ్వులతో నిండిపోయింది. చిరునవ్వు ఆపుకోలేని వారిలో జూనియర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ఉన్నారు.
 
ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ హిట్ పాట "నాటు నాటు"కి తన డ్యాన్స్ మూవ్‌లను చూపించమని సుమ బ్రహ్మాజీని సవాలు చేసింది. ఇక బ్రహ్మాజీ డ్యాన్స్‌కి జూనియర్ ఎన్టీఆర్ నవ్వుకున్నారు. 
 
రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన అమిగోస్ చిత్రంలో కళ్యాణ్ రామ్- ఆషికా రంగనాథ్ తారాగణం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.