శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (13:29 IST)

ప్రొడ్యూసర్ గిల్డ్ మాఫియా వల్ల సినిమా పరిశ్రమ నాశనం: సి.కళ్యాణ్ సెన్సషనల్ కామెంట్

C.Kalyan'
C.Kalyan'
తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటినుంచో నిర్మాతల మండలి ఉంది. కానీ ఆ తర్వాతా అంటే కరోనాకు ముందు రెండుగా విడిపోయింది. ప్రొడ్యూసర్ గిల్డ్ అని కొద్దిమంది నిర్మాతలు పెట్టుకుని సినిమాలను ప్రమోషన్ చేసుకుంటున్నారు.  దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.  అయితే రెగ్యులర్ ప్రొడ్యూసర్ కలిపి ఇలా పెట్టుకున్నామని తెలిపారు. నిర్మాతల మండలి ఏమి చేస్తుందని కామెంట్స్ కూడా వినిపించాయి. ఇదిలా ఉండగా రేపు ఆదివారం నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ మీడియా సమావేశంలో పలు విషయాలు తెలిపారు. 
 
- 2019లో మేం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం ఎవరు సంస్థకు న్యాయం చేస్తారో వారిని గెలిపించుకోండి.  నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ 30 సంవత్సరాల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చా. ప్రొడ్యూసర్ గిల్డ్, నిర్మాతల మండలిని కలిపేందుకు ప్రయత్నం చేశా. కానీ అధ్యక్ష పదవి మోజులో నా ప్రయత్నాన్ని నీరుగార్చారు. 
 
- దిల్  రాజు, సి.కళ్యాణ్ ఫ్యానెల్ వేరు వేరు కాదు. నిర్మాతలు కొంతమంది దిల్ రాజును తప్పుదారి పట్టించారు. దిల్ రాజుతో నన్ను పోలుస్తూ దుప్ప్రచారం చేస్తున్నారు. నేను 80 చిన్న సినిమాలు తీశాను, ఎవరిని మోసం చేయలేదు. అవార్డుల కోసం డోనర్ల దగ్గర అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారు. ఇక గతంలో సినిమా షూటింగ్స్ నిలిపివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరగలేదు
 
నిర్మాతల మండలిలో ఇప్పుడు దామోదర ప్రసాద్ నాలుగేళ్లు కార్యదర్శిగా ఉన్నారు. చేసింది ఏమి లేదు.  చిన్న నిర్మాతలకు నిర్మాతల మండలిలో అన్యాయం జరుగుతోంది. చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. నిర్మాతల మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. గిల్డ్ మాఫియా వల్ల మొత్తం నాశనం అవుతుంది. అసలు గిల్డ్ లో 27 మంది సభ్యులున్నారు.  నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల సమస్యలే ఎక్కువ నిర్మాతల మండలి పరిష్కరించింది. అందుకే ఓటర్లు మీరే ఆలోచించి కొత్త బాడీని ఎన్నుకొండి అని కళ్యాణ్ తెలిపారు.