శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (11:40 IST)

శివరాత్రి సందర్భంగా ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె. డేట్‌ ప్రకటించారు

Project k. poster
Project k. poster
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్‌ కె. సినిమా ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే వుంది. దానికి ముందు ఆదిపురుష్‌ చేస్తున్నాడు ప్రభాస్‌. ఆ సినిమాకు సినిమా కష్టాలుగా షూటింగ్‌ బ్రేక్‌లు పడుతూ వుంది. ఈలోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ కె.ను తీర్చిదిద్దుతున్నారు. అందుకే శివరాత్రినాడు అభిమానులకు కానుకగా శనివారం రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు.
 
యుద్ధవాతావారణాన్ని తలపించే ప్రాంతంలో పెద్ద కుడిఅరచేయి పడివుంది. దానికి ముగ్గురు తుపాకి ఎక్కుపెట్టి దగ్గరగా వస్తున్నారు. చుట్టుపక్కల ఏవో భవంతులు, పడిపోయిన కట్టడాలు కనిపిస్తున్నాయి. సింబాలిక్గా 12.01.2024 డేట్‌ వేసి రిలీజ్‌ కాబోతుందని సూచన చేశారు.
 
వైజయంతి మూవీస్‌ బేనర్‌ 50 ఏళ్ళ సందర్భంగా సి. అశ్వనీదత్‌ చేస్తున్న సినిమా కావడంతో ఇది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అల్లుడే దర్శకుడు కావడం కూడా 50 ఏళ్ళ బేనర్‌కు యాదృశ్చికమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్‌ను చూశాక అభిమానులు స్పందన పెరిగింది. మాస్‌లో కొత్త ప్రయోగం అంటూ రకరకాలుగా వారు స్పందిస్తున్నారు. అసలు కథేమిటి అనేది త్వరలో వెల్లడించనున్నారు.