గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (16:57 IST)

ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థం పై క్లారిటీ ఇచ్చిన మిత్రులు

prabhas, kriti
prabhas, kriti
టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌తో కృతి సనన్  డేటింగ్. ఇప్పుడు త్వరలో నిశ్చితార్థం చేసుకోనుందని కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బాలీవుడ్ క్రిటిక్  ఉమేష్ చంద్ చేసిన పోస్ట్ వాళ్ళ ఇదంతా జరిగింది. కాగా, నేడు వాటికి  ప్రభాస్ సన్నిహిత మిత్రులు ఆ వాదనలను కొట్టిపారేసారు. కృతి,  ప్రభాస్ తమ రాబోయే చిత్రం ఆదిపురుష్‌లో కలిసి నటించనున్నారు.
 
ప్రభాస్‌కు సన్నిహితంగా ఉన్న మిత్ర బృందం ఈ పుకార్లను గట్టిగా ఖండిస్తూ, "చదువుతున్న కథనాలలో పూర్తిగా నిజం లేదు మరియు ఇది ఎవరో ఊహకు సంబంధించినది మాత్రమే. ప్రభాస్,  కృతి ఇద్దరూ సహ నటులు మాత్రమే.  ఏదైనా ఉంటె తామే తెలియజేస్తామని వారు పెర్టీకొన్నారు. ఇందుకు సంబందించిన నోట్ ను నేడు ప్రభాస్ పి ఆర్. తెలియజేసారు. 
 
ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్, ప్రభాస్ కలిసి నటించనున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, వత్సల్ శేత్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16, 2023న థియేటర్లలోకి రానుంది.