ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (10:20 IST)

ఆర్‌.సి.15లో విప్లవనాయకుడు పాత్ర కోసం వేట!

RC 15 poster
RC 15 poster
రామ్‌చరణ్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ఆర్‌.సి.15. ఇది వర్కింగ్‌ టైటిల్‌. ఈ సినిమా కొద్దికొద్దిగా షూటింగ్‌ జరుపుకుంటోంది. తాజా షెడ్యూల్‌ చేయాల్సివుండగా కియారా అద్వానీ పెండ్లి వల్ల వేరే పార్ట్‌ తీయాల్సివస్తుందని తెలుస్తోంది. అయితే ఈనెల9వ తేదీనుంచి తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో షూట్‌ చేయాల్సివుంది. ఈ సినిమా పీరియాటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 
 
శంకర్‌ సినిమాల్లో కథ తెలిసిందే. అవినీతిపై పోరాటం. ఇందులో కూడా అదే పాయింట్‌తో ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా తీయనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ తన గురువు బోధనలు విని దేశంలో అవినీతిని తరిమి కొట్టవచ్చనే ప్రబలంగా నమ్ముతాడు. ఆ గురువు పాత్ర ఎవరనేది గత కొద్దికాలంగా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. మెగాస్టార్‌ చిరంజీవి అయితే బాగుంటుందని యూనిట్‌ చెప్పినా ఇప్పటికీ ఆచార్య చేయడంతో తండ్రీ కొడుకుల్ని గురు, శిష్యులుగా చూడడం కష్టమని శంకర్‌ తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే కన్నడ స్టార్‌ ఉపేంద్రను తీసుకునే పనిలో వున్నట్లు సమాచారం. త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
 
కార్తీక్ సుబ్బరాజ్ కెమెరా చేస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీ నటిస్తున్నారు.