ఎన్.టి.ఆర్. 30లో కథ ఎలా వుంటుందో హింట్ ఇచ్చేశారు!
ఎన్.టి.ఆర్. 30కు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ వస్తూనే వుంది. తారక రత్న మరణంతో ఈ సినిమా ప్రారంభం వాయిదా పడిరది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ చేసిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిసాయి. అందుకే అభిమానులకు ఏదోఒక రూపంలో ఈ సినిమా గురించి అప్‌డేట్ ఇస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మార్చి 18న ప్రారంభిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ తెలియజేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల డేట్ కూడా చెప్పేసింది.
కాగా, నేడు ఈ సినిమా గురించి పవర్ ఫుల్ డైలాగ్‌లను పోస్ట్ చేశారు. దానితో కథ ఎలా వుంటుందో ముందుగా అభిమానులకు హిట్ ఇచ్చారు. విడుదల చేసిన పోస్టర్‌లో ధైర్యం వ్యాధిగా మారినప్పుడు భయం మాత్రమే నివారణ అంటూ కాప్షన్ కూడా పెట్టేశారు. దానితోపాటు .. కుట్రలుపన్నే మాఫియాలు... కమ్ముకువచ్చే విషరాతలు..అయినోళ్ళ విషబీజాలు... కుల్లుకుచచ్చే కసాయి కథనాలు...ఓర్చుకోలేని పెద్దమనుషులు..
ఇన్ని దాటి సినిమాని నిలబెట్టాలి... తొడగొట్టాలి
అంటూ ఎన్.టి.ఆర్. పాత్రలోని తీవ్రతను కథలోని సీరియస్‌ను దర్శకుడు కొరటాల శివ తెలియజేశాడు. దీనిని బట్టి చూస్తే వర్తమాన రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాలో పలు భాషల నటీనటులు నటించనున్నారు.