మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (11:47 IST)

నేటి నుంచి 'వాల్తేరు వీరయ్య' స్ట్రీమింగ్

waltair veerayya
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం 27వ తేదీ నుంచి నెట్‌ఫ్లిట్‌ ఫిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చిరు సినిమాను థియేటర్‌లో చూడటం కుదరదని అభిమానులు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ చిత్రం విడుదలైన విషయం తెల్సిందే. 
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలను పోషించారు. అలాగే, "అన్నయ్య" చిత్రం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించారు.
 
సంక్రాంతికి బరిలో నిలిచిన నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డితో పోటీపడిన వాల్తేరు వీరయ్య ఓవరాల్‌గా రూ.250 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ఓవర్సీ‌స్‌లోనూ వాల్తేరు వీరయ్య సినిమా 2.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లలో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సోమవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.