మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (20:30 IST)

'రావణాసుర' మాములుగా వుండదు.. దద్దరిల్లుతుంది... ఏప్రిల్ 7న ఇరగదీసేద్దాం: రవితేజ

ravanasura pre release event
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో 'రావణాసుర' ప్రీరిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.
 
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్.. దర్శకుడితో మాంచి సింక్‌లో వుండి ప్రతి సెట్ చాలా అద్బుతంగా వేశారు. డివోపీ విజయ్ కన్నన్ ఎక్స్‌టార్డినరీగా చేశారు. రెండు పాటలు చేసిన జికే విష్ణు, దివాకర్ మణి, ప్రసాద్ మురెళ్ళకి థాంక్స్. వెంకట్, శివ ఫైట్స్ ఇరగదీశారు. మా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఎక్స్‌లెంట్‌గా చేశారు. ఈ సినిమా మ్యూజిక్‌కి స్పెషల్ ఎప్పిరియన్స్ భీమ్స్. నాకు ఇష్టమైన టెక్నిషియన్. ఈ సినిమాకి హర్ష వర్ధన్.. అద్భుతమైన సౌండ్ ఇచ్చాడు. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. 
 
రైటర్ శ్రీకాంత్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళాలి. తనతో టైగర్ నాగేశ్వర్ చేస్తున్నాను. రోజ్ డ్యాన్స్‌లని చాలా ఎంజాయ్ చేస్తారు. మేఘా, దక్ష, పూజిత, అను, ఫారియా.. హీరోయిన్స్ అంతా పర్ఫెక్ట్‌గా చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆదితో నాకు మంచి టైమింగ్ కుదిరింది. ఈ కాంబినేషన్‌కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని కోరుకుంటున్నాను. మా ఎడిటర్ నవీన్ నూలి.. సినిమా చూసి మొదట చెప్పాల్సింది వాళ్ళే. ఈ సినిమా గురించి చాలా బాగా చెప్పాడు. చాలా నమ్మకంగా వున్నాం. ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఏప్రిల్ 7న విజల్స్ పడతాయి. 
 
మా ఆర్టీ టీం వర్క్ శ్వేతా, వ్రిందా, నమ్రత.. ఆర్టీ టీం వర్క్ బ్యాక్ బోన్స్. అభిషేక్ నామాని మేము క్యూట్ బాయ్ అంటాం. రావణాసుర టైటిల్ కూడా అతనిదే. టైటిల్ డిజైన్స్ కూడా తనవే. తను మల్టీ టాలెంటెడ్. ఈ సినిమా పెద్ద హిట్ అయి మా ఇద్దరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బావుంటుంది. నిర్మాతలుగా మాకు మంచి కాంబినేషన్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. సుశాంత్ చాలా సాఫ్ట్ పర్శన్. తనతో చేసిన ప్రతి సీను ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో తనది ఎక్స్ లెంట్ క్యారెక్టర్. చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాతో కొత్త సుశాంత్‌ని చూడబోతున్నారు. 
 
సుధీర్ వర్మ నాకు ఇష్టమైన డైరెక్టర్. చాలా స్వీట్ అండ్ పాజిటివ్ పర్శన్. సుధీర్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. ఏప్రిల్ 7 థియేటర్స్‌లో ఇరగదీసేద్దా. మాములుగా వుండదు. సౌండ్ దద్దరిల్లుతుంది. ప్రేక్షకులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు. జై సినిమా’’ అన్నారు.
ravanasura team
 
సుశాంత్ మాట్లాడుతూ.. అభిషేక్‌కు థాంక్స్. శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే రవితేజని ఇలా ఎప్పుడూ చూడలేదు, చాలా బావువుందని చెప్పాను. మాస్ మహారాజాని ఎప్పుడూ ఇలా చూసి వుండరు. సుధీర్ అద్భుతమైన డైరెక్టర్. హీరోయిన్స్ అంతా చక్కగా చేశారు. టెక్నిషియన్స్ అందరికి కృతజ్ఞతలు. రవితేజతో పని చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయనతో పని చేయడం చాలా ఎంజాయ్ చేశాను’’ అన్నారు. 
 
దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా "స్వామి రారా" తర్వాత నాకు వచ్చిన మొదటి ఫోన్ కాల్ రవితేజ గారిది. ఆప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు. ఒకసారి ఫోన్ చేసిన శ్రీకాంత్ కథ చెప్పాడు విను అన్నారు. అద్భుతమైన కథ. ఇంత మంచి కథ డైరెక్ట్  చేయడానికి నన్ను ఎంచుకోవడం అనందంగా వుంది. హీరోయిన్స్ అందరూ అద్భుతంగా చేశారు. రవితేజ ఎప్పుడూ ఎక్స్‌టార్డినరీగా చేస్తారు. ఈ సినిమాలో థ్రిల్ అవుతారు, షాక్ అవుతారు. ఇందులో సుశాంత్ మరో సర్ప్రైజ్. ఆయన్ని కొత్తగా చూపించానని భావిస్తున్నాను. శ్రీకాంత్ అద్భుతమైన కథ ఇచ్చారు. హర్ష వర్ధన్, బీమ్స్, విజయ్, శీను.. టెక్నికల్ టీం, ప్రొడక్షన్ టీం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 
 
నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. ఈ వేడుక చూస్తుంటే 50 రోజుల పండగలా వుంది. ఏప్రిల్ 7 తర్వాత.. ఇక్కడే యాభై రోజుల పండగ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు. 
 
హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ.. నాకు ఇంతపెద్ద అవకాశం ఇచ్చిన రవితేజ గారికి, నిర్మాతకు, దర్శకుడు సుధీర్ వర్మ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు.
 
భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. రవితేజ నన్ను తలెత్తుకునేలా చేశారు. ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రవితేజతో పని చేయడం అంటే ఆయన అభిమానులతో కలసి పని చేయడం లాంటింది. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు.
 
పూజిత మాట్లాడుతూ.. ‘రావణాసుర’ నాకు చాలా స్పెషల్ మూవీ. రవితేజతో పని చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. దర్శక నిర్మాతలకు, నటీనటులందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న అందరూ ‘రావణాసుర’ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
 
దక్ష మాట్లాడుతూ...అభిషేక్ పిక్చర్స్ నాకు హోం బ్యానర్‌లా అనిపిస్తుంది. సుధీర్ వర్మతో పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. రవితేజ లాంటి గ్రేట్ కోస్టార్‌తో పని చేయడం నాకు ఇదే మొదటి. టీం అందరికీ థాంక్స్. 
 
మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. రవితేజ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్టింగ్ డ్యాన్సింగ్, కామిక్ టైమింగ్ సెన్స్ అఫ్ హ్యుమర్  ఇలా చాలా విషయాలు వున్నాయి. రవితేజ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇలాంటి యూనిక్ ఫిల్మ్‌లో భాగం అయినందుకు చాలా ఆనందంగా వుంది. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు.
 
ఎస్కేఎన్ మాట్లాడుతూ.. రవితేజ కేవలం ప్రతిభని నమ్మే వ్యక్తి. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆయన పాత రికార్డులన్నీ బద్దలుగొట్టేలా వుంది. సుశాంత్‌కి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
వంశీ మాట్లాడుతూ.. రవితేజతో పని చేస్తున్నపుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు నేను గెలవాలి అనరు. మనం గెలవాలి అంటారు. నేనుండాలి అనరు. మనం వుండాలి అంటారు. అది గొప్ప లక్షణం. సుధీర్ వర్మ థ్రిల్లర్ అద్భుతంగా తీశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు. 
 
సురేష్ బాబు మాట్లాడుతూ.. రవితేజకి అభినందనలు. తను ఎనర్జిటిక్ పర్శన్. దర్శకుడు సుధీర్ వర్మ, నిర్మాతలు, సుశాంత్, హీరోయిన్స్, అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. నా లాంటి దర్శకులు ఇండస్ట్రీలో వున్నారంటే దానికి కారణం మాస్ మహారాజ రవితేజ. ఆయనతో మూడు సినిమాలు తీశాను. మనం ఒకటి అడిగితే నాలుగు వేరియేషన్స్ ఇచ్చే హీరో రవితేజ. డాన్ శీను సమయంలో రాజమౌళి స్వయంగా ఈ మాట చెప్పారు. పరిశ్రమలో నాకు అన్నయ్య రవితేజ. రావణాసుర ట్రైలర్ ఎక్స్‌టార్డినరిగా వుంది. సుధీర్ వర్మ అద్భుతమైన టెక్నిషియన్. మంచి టీం ఎక్స్‌టార్డినరిగా తీశారు. సుశాంత్‌కి ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాలో చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.  
 
హనురాఘవపూడి మాట్లాడుతూ.. రవితేజకి నిజంగా దండం. మొన్న వాల్తేరు వీరయ్యల్లో ఒకలా కనిపించారు. అంతకుముందు ధమాకాలో మరోలా కనిపించారు. ఇప్పుడు రావణాసురలో ఇంకోల కనిపిస్తున్నారు. మూడు తలలు ఇందులోనే అయిపోయాయి. ఇప్పటికే బోలెడు హ్యాట్రిక్‌లు ఇచ్చారు. ఇది మరో హ్యాట్రిక్ అవుతుంది. ఇందులో సందేహం లేదు. టీజర్ ట్రైలర్ అద్భుతంగా వున్నాయి. ఈ సినిమా సుధీర్ కోసం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’’ చెప్పారు.
 
వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. రావణాసుర ట్రైలర్ చాలా నచ్చింది. రవితేజ గారికి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు’’ అన్నారు.
 
హైపర్ ఆది మాట్లాడుతూ.. ప్రతిభని ప్రోత్సహించే హీరో రవితేజ. ఆయనది గొప్ప మనసు. సినిమాతో పాటు సినిమా చేసే హీరో రవితేజ. ఎప్పుడూ పాజిటివ్‌గా వుంటారు. ..రావణాసురకి పది తలలు వుంటాయి. తలకి 10 కోట్లు వేసుకున్నా.. ఈ సినిమాకి వందకోట్లు గ్యారెంటీ. హ్యాట్రిక్ వందకోట్లు హిట్లు ఈ సినిమాతో రవితేజ అన్నకి సాధ్యం కాబోతుంది. సుధీర్ వర్మ అద్భుతంగా తీశారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు
 
శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ.. రావణాసుర కథ ఇంత అద్భుతంగా రావడానికి కారణం రవితేజ. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వుండే వ్యక్తి రవితేజ. ఆయన స్థితప్రజ్ఞుడు. అందుకే సక్సెస్ ఆయన్ని వెదుక్కుంటూ వస్తుంది. ఆయనతో జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. రవితేజ స్పీడ్‌కి మ్యాచ్ చేయగలిగే దర్శకుడు సుధీర్ వర్మ. నిర్మాత అభిషేక్ నిర్మాణంతో పాటు క్రియేటివ్ వర్క్‌లో కూడా ఆయన సహకారం చాలా వుంది. రావణాసురలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న థియేటర్‌లో కలుద్దాం. తర్వాత సక్సెస్ మీట్‌లో కలుద్దాం'' అన్నారు
 
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం రెండు పాటలు రాశాను. పాటలన్నిటినీ అద్భుతంగా ఆదరించారు. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. రవితేజ ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా చాలా వైలెంట్‌గా అద్భుతంగా వచ్చింది. మీ అందరూ సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను.