ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (13:05 IST)

సముద్రంలో పుట్టిన సైతాన్ గా ఎన్ .టి.ఆర్. లుక్ ఇదే

NTR saithan look
NTR saithan look
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ NTR 30. గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో   ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్స్ కీలకం అని ఇప్పటివరకు తెలుగులో రాని విధంగా ఉంటాయని కొరటాల చెప్పారు. 
 
శనివారం నాడు ఓ పోస్టర్ ను యువ సుధ ఆర్ట్స్ విడుదల చేసింది. సముద్రం  అలలు ఎర్రగా పైకి ఎగసి పడుతుంటే ఎన్టీఆర్ కత్తి, డాలు పట్టుకుని అక్కడ రాయి పై నిలుచుని ఆలోచిస్తున్నట్లు ఉంది.  సముద్రంలో భయం అంటే తెలియదు. రోజు వారి సముద్రం వారి జీవనం. అలాంటివారిని కొన్ని మృగాలు భయపెట్టిస్తాయి. రక్తం పిండేస్తాయి. ఆ మృగాలకు వాడు సముద్రంలో పుట్టిన సైతం లా కనిపించాడు. అంటూ.. కొద్దిగా క్లూ ఇచ్చింది. ఇండియా లోని  కోస్టల్  బ్యాక్ డ్రాప్ కనుక సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అయితే  సముద్ర దొంగలు నేపథ్యంలో ఇంగ్లీషులో వచ్చాయి. మరి వాటికి దీనికి తేడా ఏమిటో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.