శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (13:56 IST)

సుకుమార్ రైటింగ్స్ లో ఆశిష్ రెడ్డి సెల్ఫిష్ లుక్

Ashish Reddy,
Ashish Reddy,
దిల్ రాజు సోదరుని కుమారుడు హీరో ఆశిష్ రెడ్డి తొలి చిత్రం రౌడీ బాయ్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’ కోసం నూతన దర్శకుడు కాశీ విశాల్‌తో చేస్తున్నాడు..సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 
ఉగాది సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.  ఆశిష్ రెడ్డి నోట్లో బీడీతోతన నిర్లక్ష్య వైఖరినిచూపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ ప్రజంట్ చేసింది. గిరజాల జుట్టు, గడ్డంతో, తెల్లటి చొక్కా,  ఆరెంజ్ కలర్ జీన్స్‌లో మాసీగా కనిపిస్తున్నాడు ఆశిష్. ఈ సినిమా కోసం ఆశిష్ మంచి ఫిజిక్ బిల్ట్ చేసుకున్నారు.  
 
ఫస్ట్ లుక్ లో రిజర్వడ్ ఫర్ మై లవ్ అనే గూగుల్ సెర్చ్ స్పేష్ కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లోని మ్యాప్‌ను సూచిస్తున్నట్లుగా.. ఈ సినిమా కథ హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతుంది. ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్ సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకునే వ్యక్తి.  
 
హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఎస్ మణికంధన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ లిరిక్ రైటర్‌. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.