శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (11:20 IST)

ఎన్‌టి.ఆర్‌.30 సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌

Saif Ali Khan, NTR, koratala
Saif Ali Khan, NTR, koratala
పాన్‌ ఇండియా సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎన్‌టి.ఆర్‌.30 సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ ప్రవేశించారు. ఈ విషయాన్ని ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ నిర్మాణ సంస్థలు సోషల్‌ మీడియాలో ఫొటోలతోసహా షేర్‌ చేశాయి. ఇటీవలే బాలీవుడ్‌ నుంచి జాన్వీకపూర్‌ కూడా జాయిన్‌ అయింది. ఎన్‌.టి.ఆర్‌.తో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది.
 
Saif Ali Khan, NTR, koratala
Saif Ali Khan, NTR, koratala
ఇక ఈ సినిమా పూర్తి మాస్‌ యాక్షన్‌తో కూడినదని దర్శకుడు విడుదల చేసిన పోస్టర్లలోనూ ఓపెనింగ్‌ నాడు చెప్పిన మాటల బట్ఠి అర్థమయింది. కోస్టల్‌ ఏరియా నేపథ్యంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సినిమాగా రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్‌.టి.ఆర్‌. లుక్‌ చాలా రగ్గెడ్‌ గా వుంటుంది. సముద్రదొంగలు జాలర్లపై ఏవిధంగా కరుకుదనం ప్రదరిస్తారో అంతకుమించి వారికి తగినట్లే ఎన్‌.టి.ఆర్‌. పాత్ర వుంటుందని తెలుస్తోంది. ఈ రోజు షూటింగ్‌ హైదరాబాద్‌ శివార్లో జరుగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.