సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆమె అలా తయారైంది : సన్నీ లియోన్

sunny leone
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన నటి సన్నీ లియోన్. ఆమె తాజాగా ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. తన తల్లి మద్యానికి ఎందుకు బానిస అయిందో వివరించారు. అమెరికాలో ఉండగా పోర్న్ చిత్రాల్లో నటించడం, తన తల్లి మద్యానికి అలవాటు పడటం తదితర విషయాల గురించి తెలిపారు. ముఖ్యంగా, తన నీలి చిత్రాల కెరీర్ కూడా తల్లి మద్యానికి బానిసయ్యేందుకు ఓ కారణం అయ్యి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
 
'అమ్మకు అప్పటికే మద్యం తాగే అలవాటు ఉంది. కానీ నేను పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడమే నా తల్లి మద్యానికి బానిసయ్యేందుకు కొంత మేరకు కారణమని చెప్పక తప్పదు. దీని వల్ల మా ఇంట్లో నానా రచ్చ జరగుతుండేది. నా కంటే కూడా మా అమ్మకు మందే ఇష్టమని అనికునేదాన్ని. కానీ అసలు విషయం అది కాదని తర్వాతి కాలంలో అర్థమైంది. ఇది ఓ మానసికమైన సమస్య. దీనికి నేను, నా సోదరుడు లేదా మా నాన్న బాధ్యులం కాము' అని సన్నీ లియోన్ తెలిపింది.