శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (16:37 IST)

పని మనిషి కుమార్తె కోసం తల్లడిల్లిన సన్నీ లియోన్

sunny leone
తన ఇంట్లో పని చేసే పని మనిషి కుమార్తె కనిపించకుండా పోయింది. ఆ పాప కోసం ప్రముఖ నటి సన్నీ లియోన్ తల్లడిల్లిపోయింది. ఆ పాపను ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతి కూడా ఇస్తానని ప్రకటించారు. అలా ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఆ పాప ఆచూకీ లభ్యమైందని ఆమె మరో ట్వీట్ చేశారు. 
 
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పలువురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తన ఇంట్లో పని చేసే పని మనిషి కుమార్తె అనుష్క ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. దీంతో సన్నీ లియోన్ తల్లడిల్లిపోయింది. ఆమెను వెతకడంలో సాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా కోరింది. 
 
తొమ్మిదేళ్ల వయసున్న అనుష్క.. ఈ నెల 8వ తేదీన జోగేశ్వరి బెహ్రామ్ బాగ్‌లోతప్పిపోయిందని, ఆ పాప తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఆమెను వెతికి తీసుకొచ్చిన వారికి రూ.50 వేల వరకు బహుమతి ఇస్తామని చెప్పారు. ఈ ట్వీట్‌ను ముంబై పోలీసులకు కూడా సన్నీ ట్యాగ్ చేశారు. దీంతో ఆ ట్వీట్ కాస్త వైరల్ అయింది. 
 
మరోవైపు, తప్పిపోయిన చిన్నారి అనుష్క ఆచూకీ దొరికిందని సన్నీ లియోన్ ప్రకటించింది. పాప దొరికింది అంటూ ఆమె మరో పోస్ట్ చేసింది. ఆ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయని తెలిపింది. ముంబై పోలీసులకు ధన్యవాదాలు తెలియజేసింది. 24 గంటల్లోనే అనుష్క ఆచూకీ లభ్యమైంది. ఆమె కోసం తాను పెట్టన పోస్టును షేర్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు. కాగా, తప్పిపోయిన పని మనిషి కుమార్తె పట్ల సన్నీ లియోన్ చూపిన ప్రేమ, తపనను చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.