సంబంధిత వార్తలు
- పబ్జికి ప్రేమ... చండీగఢ్‌కు అమెరికా అమ్మాయి.. పెళ్లి చేసుకున్నారు.. బస్సులో?
- ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దు : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సూచన
- క్లాప్ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం.. రద్దు చేసిన టీడీపీ సర్కారు!
- ఏపీలో వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కారు... స్పందన పేరు మార్పు!!
- ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో దాయాది దేశానికి చెత్త రికార్డ్
అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?
నిజానికి హీరో అడవి శేష్ పేరు ఇది కాదు. తన పేరు 'అడివి సన్నీ చంద్ర'. అయితే తన పేరు మార్చుకోవడానికి సన్నీలియోన్ కారణం అని చెప్పాడు. కాలేజీ చదివే రోజుల్లో సన్నీ లియోన్ బాగా ఫేమస్ కావడంతో తన ఫ్రెండ్స్ అందరూ తనను సన్నీ లియోన్, సన్నీ లియోన్ అని ఏడిపించే వారట. దీంతో వాళ్ళ బాధ పడలేక తన పేరుని అడవి శేష్‌గా మార్చుకున్నట్లు తెలిపాడు.
హైదరాబాద్‌లో పుట్టిన అడవి శేషు అమెరికాలో పెరిగాడు. అక్కడ ఇండియన్ యాక్టర్స్ హాలీవుడ్ సినిమాలలో చిన్న పాత్రలకే పరిమితం కావడాన్ని గమనించాడు. అందువల్ల అక్కడ సినిమాలో నటించడం కష్టమని భావించి ఇండియాకు తిరిగి వచ్చాడు.
Adavi Shesh
ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. మేజర్, గూఢాచారి వంటి చిత్రాలతో భారతదేశం అంతటా పాపులర్ అయిన అడివి శేష్, రాబోయే రోజుల్లో "డకాయిట్" వంటి సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
