1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (19:48 IST)

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

harish shankar with movie team
harish shankar with movie team
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'మా ఊరు శ్రీకాకుళం' టైటిల్ సాంగ్ ని లాంచ్ చేశారు.
 
సునీల్ కశ్యప్ ఈ సాంగ్ క్యాచి అండ్ టచ్చింగ్ నెంబర్ గా కంపోజ్  చేశారు. శ్రీకాకుళం గురించి సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. మంగ్లీ ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. విజువల్స్ సూపర్బ్ గా వున్నాయి.  
 
సాంగ్ లాంచింగ్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' టైటిల్ సాంగ్ లాంచ్ చేయడం చాలా అనందంగా వుంది. టైటిల్ చాలా ఫన్నీగా వుంది. మోహన్ నాకు రైటర్ గా ఉన్నప్పటి నుంచి పరిచయం. చాలా మంచి రైటర్. సాంగ్ చూశాను. మంగ్లీ అద్భుతంగా పాడింది. విజువల్స్ కూడా చాలా బావున్నాయి. వెన్నెల కిషోర్ గారి నుంచి ఒక డిఫరెంట్ సినిమా ఎక్సపెక్ట్ చేస్తున్నాం. యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' తెలిపారు.
 
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక న నిపుణులు పని చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు.
మల్లికార్జున్ ఎన్ డీవోపీ గా, అవినాష్ గుర్లింక ఎడిటర్ గా పని చేస్తున్నారు. బేబీ ఫేం సురేష్ బిమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. : రాజేష్ రామ్ బాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల , సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహాద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ మహేష్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయ్ ఐడ్రీం నాగరాజు, ఎంవీఎన్ కశ్యప్..