శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (18:11 IST)

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

Priyadarshi
Priyadarshi
పాన్ ఇండియా సెన్సేషన్ హను-మాన్ తర్వాత కె నిరంజన్ రెడ్డి ప్రైమ్‌షోఎంటర్‌టైన్‌మెంట్‌, ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ పోషిస్తున్న కంప్లీట్ డిఫరెంట్ మూవీ 'డార్లింగ్' తో ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. శ్రీమతి చైతన్య ఈ రోమ్-కామ్ ను ప్రజెంట్ చేస్తున్నారు. అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు.
 
మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్‌లను కిక్ స్టార్ట్ చేశారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ ఖలసే ని రిలీజ్ చేశారు. వివేక్ సాగర్ పెప్పీ నంబర్‌ను కంపోజ్ చేశారు. ఈ పాటను హనుమాన్ సిహెచ్‌తో కలిసి రామ్ మిరియాల పాడారు. రామ్ మిరియాల వాయిస్ లో ఫన్ వైబ్ మరింత ఎనర్జీని క్రియేట్ చేసింది
 
ఈ పాట ఓ కామన్ మ్యాన్  ఫ్రస్ట్రేషన్ ప్రజెంట్ చేస్తోంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు లైఫ్ లో చిల్‌ అవ్వమని చెబుతుంటారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం హ్యూమరస్ గా వుంది. ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ గా ప్రమోట్ చేస్తున్న ఈ పాటలో  ప్రియదర్శి తన డ్యాన్స్ స్కిల్స్ చూపించారు.
 
 టైటిల్‌ గ్లింప్స్ అద్భుతమైన స్పందన లభించగా, ఫస్ట్  సింగిల్ కూడా ఇన్స్టంట్ హిట్‌గా నిలిచింది.
 
బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.
 
నరేష్ రామదురై  డీవోపీ వ్యవహరిస్తుండగా, హేమంత్ డైలాగ్స్ అందిస్తున్నారు, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ ఇ రాఘవ్ చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.