సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 మే 2024 (11:34 IST)

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

Swayambhu latest poster
Swayambhu latest poster
నిఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం స్వయంభు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్, నబా నటేష్ నాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే యుద్ధ ఎపిసోడ్ లో నబా పాల్గొన్నారు. హిస్టారికల్‌ సబ్జెక్ట్‌ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శత్రువులను చీల్చి చెండాడే యుద్ద వీరుడిగా నిఖిల్ కనిపించబోతున్నారు.
 
లేటెస్ట్ అప్ డేట్ ఏమంటే,  స్వయంభు బృందం ఒక పురాణ యుద్ధ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది. ఇందుకోసం 8 కోట్లు వెచ్చిస్తున్నదని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
 
12 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌ను భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ మరియు స్టంట్స్‌లో నిఖిల్ పరాక్రమాన్ని చూపుతుంది. ఈ సీక్వెన్స్ పెద్ద స్క్రీన్‌లపై అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కార్తికేయ సీక్వెల్ తర్వాత నిఖిల్ ఆచితూచి చేస్తున్న చిత్రమిది.  ఠాగూర్ మధు, భువన్ సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రం  పిక్సెల్ స్టూడియో బేనర్ లో రూపొందుతోంది.