స్వయంభూ నిఖిల్, సంయుక్త పై పాట చిత్రీకరణ లేటెస్ట్ అప్ డేట్
కార్తికేయ ఫేమ్ నిఖిల్ హీరోగా సంయుక్త మీనన్ నాయికగా నటిస్తున్న చిత్రం స్వయంభూ. గత ఏడాది షూటింగ్ మొదలయి కొంత గేప్ తీసుకుని ఇటీవలే షూట్ ప్రారంభించారు. అందులో భాగంగా సంయుక్త మీనన్ గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలు కూడా పెట్టారు. తాజా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
దీని గురించి మరింత అప్ డేట్ రేపు ఉదయం 10.08 గంటలకు ఈ మనోహరమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తుందని ప్రకటిస్తున్నాను. అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది.
నిఖిల్ కథరీత్యా ఓ యోథుడుగా నటిస్తున్నాడు. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ శిక్షణ తీసుకున్నాడు. భరత్ క్రిష్ణమాచారి దర్శకత్వంలో శ్రీకర్ ప్రొడక్షన్ లో రూపొందుతోంది. ఠాగూర్ మధు సమర్పకుడు.